‘కథ, స్కీన్‌ప్లే, దర్శకత్వం.. చంద్రబాబు’

12 Sep, 2022 18:58 IST|Sakshi

సాక్షి, కాకినాడ: తన స్వార్థ రాజకీయాలే చంద్రబాబుకు ముఖ్యమని.. రాష్ట్రం ఏమైపోయినా ఆయనకు అవసరం లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు లాంటి వ్యక్తి ఏపీలో ఉండటం ప్రజల దురదృష్టమన్నారు.
చదవండి: మా ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలా? చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైర్‌

‘‘చంద్రబాబు డైరెక్షన్‌లోనే అమరావతి ఉద్యమం. ఆయనకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. అమరావతి ఉద్యమానికి చంద్రబాబే కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం. అన్ని ప్రాంతాల ప్రజలూ సమానమైన భావన ఉండాలి. చంద్రబాబుకు రాజకీయం, రియల్‌ ఎస్టేట్‌ ముఖ్యం.. అమరావతి యాత్ర పూర్తిగా రాజకీయ యాత్ర’’ అంటూ కన్నబాబు నిప్పులు చెరిగారు.

‘‘మీ ఆస్తులు పెంచుకునేందుకే యాత్ర పేరుతో డ్రామాలు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆత్మగౌరవం లేదా?. దుష్ట చతుష్టయం పన్నాంగం పన్నుతోంది. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలో ఏం చెప్పారో తెలీదా?. టీడీపీ సొంత అజెండాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయదు. చంద్రబాబు లాంటి స్వార్థపరుడి చేతికి రాష్ట్రం వెళ్లకూడదు. టీడీపీ తప్పుడు ప్రచారాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు’’ అని కన్నబాబు అన్నారు.
 

మరిన్ని వార్తలు