విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించాలి

6 Aug, 2020 09:31 IST|Sakshi
మాట్లాడుతున్న ఏపీ హోం మంత్రి సుచరిత

రాజధాని తరలింపు కాదు   అభివృద్ధి వికేంద్రీకరణ 

దళితులపై అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులను సహించం 

కాశీబుగ్గ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేశాం 

ఏపీ హోం మినిస్టర్‌ ఎం. సుచరిత  

రాయదుర్గం: విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలతో చంద్రబాబునాయుడు మొదట రాజీనామా చేయించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎం. సుచరిత అన్నారు.   రాయదుర్గంలోని తన నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు మొదట తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మాట్లాడాలన్నారు. రాజధానిని తరలించడం లేదని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందన్నారు.

అమరావాతిలో శాసనరాజధాని, విశాఖపట్నంలో పరిపాలనారాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారన్నారు. విధి నిర్వహణలో దళితులపై అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులను ప్రభుత్వం సహించదని, కాశీబుగ్గలో దళితుడిని కాలుతో తన్నిన ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేశామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వరకట్న వేధింపులు, మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. రాష్ట్రపతి ఆమోదం లభించకపోయినా 18 దిశ పోలీస్‌స్టేషన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.  
 

మరిన్ని వార్తలు