‘మన పీక కోసేందుకు అరసవల్లి వస్తారంట’

7 Oct, 2022 13:38 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: విశాఖ రాజధాని ఏర్పాటైతే ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్‌ బాగుంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అరసవల్లిలో శుక్రవారం.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు చెన్నై, కర్నూలు, హైదరాబాద్‌ పరుగెత్తాం. మా ప్రాంతానికి రాజధాని వస్తే చంద్రబాబుకు వచ్చిన అభ్యంతరం ఏంటి? అంటూ ప్రశ్నించారు.
చదవండి: కీచక టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ అరెస్టు

‘‘విశాఖ రాజధాని కోసం త్యాగాలు, చందాలు అవసరం లేదు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దంటూ అరసవల్లి వస్తారంట. మన పీక కోసేందుకు అరవసల్లి వస్తారంట. విశాఖ రాజధాని వద్దని చంద్రబాబు అంటున్నారు. అడ్డొచ్చిన వారిని చితక్కొట్టాలని చంద్రబాబు అంటున్నారు’’ అని మంత్రి ధర్మాన మండిపడ్డారు.

మరిన్ని వార్తలు