అందుకే ఆ జీవో తెచ్చాం: మంత్రి జోగి రమేష్‌

4 Jan, 2023 19:48 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమాయకుల ప్రాణాలు చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసులపై బాబు దాడులు చేయిస్తున్నారు. రోడ్లపై బహిరంగ సభలు పెట్టొద్దని చెప్పాం. ప్రజల కోసం ప్రభుత్వం మేలు చేసే జీవో ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు.

‘‘కుప్పంలో చంద్రబాబుకు ఓటుహక్కు ఉందా?. అక్కడ​ చంద్రబాబుకు ఇల్లు కూడా లేదు. కుప్పంలో పోలీసులపై నోరు పారేసుకుంటున్నాడు. బాబుకు కుప్పంలో చెప్పుకునేందుకు ఏమీ లేదు. కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడు?. అందుకే ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. అమాయకులు బలవుతుంటే త్యాగం చేశారని బాబు అంటున్నారు. బాబు కోసం త్యాగం ఎవరు చేయాలి. ఎందుకు చేయాలి. కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు మృతిచెందారు. చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌కి వెళ్లిపోయారు’ అని జోగి రమేష్‌ దుయ్యబట్టారు.
చదవండి: నాకే రూల్స్‌ చెబుతారా..? కుప్పంలో పోలీసులపై చంద్రబాబు వీరంగం

‘‘పుత్రుడు, దత్తపుత్రుడు వచ్చినా చంద్రబాబును రాజకీయంగా బతికించలేరు. చివరకు కుప్పం ప్రజలే చంద్రబాబును తిరస్కరించారు. లోకేష్ మంగళగిరిలో తిరుగుతుంటే మేము ఏమైనా ఆపామా?. చంద్రబాబు కుట్ర రాజకీయాల వలన ఎన్ని జీవితాలు రోడ్డున పడ్డాయో అందరికీ తెలుసు. అధికార దాహం కోసం ఎందాకైనా తెగిస్తాడని తెలిసే ఇలాంటి జీవో  తెచ్చాం’’ అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు