‘పార్టీని లాక్కున్నప్పుడు బాలకృష్ణ నవ్వుతూ నిలబడలేదా?’

24 Sep, 2022 16:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిందెవరు?. ఎన్టీఆర్‌ను ప్రజలకు దూరం చేసిందెవరు? అంటూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్టు బాలకృష్ణ మాట్లాడుతున్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు బాలకృష్ణ ఏం చేశారు?. పార్టీని లాక్కున్నప్పుడు బాలకృష్ణ నవ్వుతూ నిలబడలేదా? మీ కుటుంబంలో బాబు పెట్టిన చిచ్చు మర్చిపోయావా బాలకృష్ణా?. చంద్రబాబు చేసిన ద్రోహంపై ఏరోజైనా ఆయన మాట్లాడారా?’’ అని మంత్రి దుయ్యబట్టారు.
చదవండి: అచ్చెన్నకు లోకేష్‌తో చెడిందా?.. చినబాబుకు కళా అందుకే దగ్గరవుతున్నారా?

ఎన్టీఆర్‌ పేరును కృష్ణా జిల్లాకు పెట్టిన ఘనత సీఎం జగన్‌దే. అధికారంలో ఉండి ఏరోజైనా బాబు దీని గురించి ఆలోచించారా?. మీరు అసలైన శునకాలు. మీరు ఎన్టీఆర్‌ కుమారులైనా పరమశుంఠలు. అసెంబ్లీకి బాలకృష్ణ ఎందుకు రాలేదు?. ఎంగిలి మెతుకులు కోసం చంద్రబాబు పంచన చేరిన మీకు వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.’’ అంటూ జోగి రమేష్‌ నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ని ట్వీట్‌ చేశారు. డైలాగులు సినిమాల్లో చెబితే బావుంటుంది. బాలకృష్ణ సినిమాలకే పరిమితమని మంత్రి అన్నారు.

మరిన్ని వార్తలు