చంద్రబాబు దీక్షలపై డిక్షనరీ రాయాలి: కన్నబాబు

23 Oct, 2021 12:30 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబు 36 గంటల దొంగ దీక్ష చేశారు. అసలు దీక్ష ఎందుకు చేశానా అని టీడీపీ అధ్యక్షుడికే డౌట్‌ వచ్చింది. ఢిల్లీ వెళ్లే టీడీపీ నేతలు రాష్ట్రపతిని ఏమని సంబోధిస్తారు’’ అని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కన్నబాబు మాట్లాడారు. ‘‘పార్టీ ఉందని నిరూపించుకోవడం కోసమే చంద్రబాబు దీక్ష డ్రామాలు చేస్తున్నారు. ఆయన దీక్షలపై డిక్షనరీ రాయాలి. చంద్రబాబు దీక్షపై టీడీపీ నేతలకే క్లారిటీ లేదు. చంద్రబాబు అమిత్‌ షా మీద రాళ్లు వేయించారు.. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారు’’ అన్ని కన్నబాబు ప్రశ్నించారు.
(చదవండి: బూతులను సమర్థిస్తూ దీక్షా?)

‘‘సీఎం జగన్‌ని సంభోదించిన పదంతోనే మీరు రాష్ట్రపతిని సంభోదించగలరా.. లోకేష్‌ కూడా చంద్రబాబును ఆ పదంతో పిలుస్తారా. అసలు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం చెబుతారు. మేం బూతులు తిడితే వైఎస్‌ఆర్‌సీపీకి ఆగ్రహం వచ్చిందని చెబుతారా. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నది మీరు కాదా’’  అని కన్నబాబు ప్రశ్నించారు. 

చదవండి: ‘చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలే’

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు