‘దుష్ట చతుష్టయం కోసం.. రియల్‌ ఎస్టేటే చంద్రబాబు ఆలోచన’

4 Oct, 2022 11:27 IST|Sakshi

సాక్షి, గుంటూరు: పాలన వికేంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందన్నారు. భూములిచ్చిన రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ ఆలోచనే రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతుందన్నారు. దుష్ట చతుష్టయం కోసం చంద్రబాబు తపన పడుతున్నాడు. ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం నడుస్తోంది. ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగేలా సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి అన్నారు.
చదవండి: అన్ని ఆలయాల్లో  కొబ్బరికాయలు కొట్టండి 

మరిన్ని వార్తలు