‘కుయుక్తులు, కుట్రలు..  దుష్ట చతుష్టయాన్ని అడ్డుపెట్టుకుని..’

11 Sep, 2022 13:53 IST|Sakshi

చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్‌

సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తున్నామని.. గత టీడీపీ ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కిందని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులున్నా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు.
చదవండి: పాదయాత్ర కాదు.. ఉత్తరాంధ్రపై చంద్రబాబు దాడి

పదవులు పంపిణీ దగ్గర నుండి పథకాల అమలు వరకు బడుగులకు సీఎం జగన్‌ ఎంతో మేలు చేస్తున్నారు. ఈ పథకాలను చూసి ఓర్వలేక చంద్రబాబు బూతులు తిడుతున్నాడు. రాజకీయంగా చంద్రబాబు దిగజారి పోయారు. చంద్రబాబు చేసే కుయుక్తులు, మోసాలు, కుట్రలను అన్నీ జనం గమనిస్తూనే ఉన్నారు. దుష్టచతుష్టయాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రెచ్చిపోతున్నారని’’ మేరుగ నాగార్జున దుయ్యబట్టారు.

‘‘అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేస్తున్న వ్యక్తి జగన్. ఎస్సీల ద్రోహి చంద్రబాబు. ఎస్సీల్లో ఎవరైనా పుడతారా అన్న వ్యక్తి చంద్రబాబు. ఎస్సీలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వ్యక్తి. అలాంటి చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదు’’ అని మంత్రి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు