‘ఫ్రస్ట్రేషన్‌తో చంద్రబాబు ఫ్యూజులు ఎగిరిపోయాయి’

1 Dec, 2022 13:18 IST|Sakshi

సాక్షి, తిరుపతి: చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌ను చూసి ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. గురువారం ఆమె తిరుపతిలో జగనన్న క్రీడా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. ఫ్రస్ట్రేషన్‌తో చంద్రబాబు ఫ్యూజులు ఎగిరిపోయాయన్నారు. చంద్రబాబు మెంటల్‌ బాలెన్స్‌ పడిపోయిందని ఆమె మండిపడ్డారు.

‘‘ఎమ్మెల్యే అవడమే కష్టం అనుకుంటున్న వ్యక్తిని సీఎం చేయాలనుకోవడం నీ అజ్ఞానం. లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను చంపాలనుకుంటున్నారని సింపతీ డ్రామాలు ఆడుతున్నారు. తండ్రి లాంటి ఎన్టీఆర్‌ను చంపిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ మంత్రి రోజా దుయ్యబట్టారు.
చదవండి: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ విజయసాయిరెడ్డి

మరిన్ని వార్తలు