కస్టడీ డే విషెస్‌తో.. పులకేశ్ నీ జాడ ఎక్కడ?.. ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్?

23 Sep, 2023 19:43 IST|Sakshi

సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం.. సీఐడీ కస్టడీ పరిణామం, మరోవైపు లోకేశ్ ఢిల్లీ పర్యటనపై ఏపీ మంత్రి రోజా సెటైర్లు విసిరారు. దేశంలోనే అవినీతి అనకొండ అయిన చంద్రబాబుకు తొలి కస్టడీ డే శుభాకాంక్షలు అని వ్యంగ్యం ప్రదర్శించారామె. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు.

పచ్చ మీడియా ను అడ్డం పెట్టుకొని మీరెన్ని తప్పులు చేసినా ప్రజలకు కనబడవు అనే రోజులు పోయాయి లోకేష్.. మీ నాన్న చేసిన ప్రతి స్కాం ను కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు, న్యాయస్థానం ముందు ఉంచాం. చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు వాటిని ఎదుర్కొంటున్నాడు. కుంభకోణాల్లో భాగస్వామ్యం వున్న ప్రతీ ఒక్కరూ చట్టానికి తలవంచాల్సిందే.. జైలుకు వెళ్లాల్సిందే.

‘‘ఖైదీ నెంబర్ 7691 కడుపున పుట్టిన నారా లోకేశ్ నీ లొకేషన్ ఎక్కడ? తండ్రి అడ్డంగా తినేసి జైలుకు వెళితే, మా నాన్న ఎలా పోయినా పర్లేదు నేను మాత్రం అరెస్ట్ కాకూడదని పారిపోయిన లోకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్? అని మంత్రి రోజా ప్రశ్నించారు.  తల్లి, భార్య మీద మీ నాన్న భారం వదిలేసి పలాయనం చిత్తగించిన పులకేశ్ నీ జాడ ఎక్కడ? మీ నాన్న అవినీతిపై బహిరంగ  చర్చకు రమ్మన్నావ్... నువ్వేమో రాష్ట్రం వదిలి పారిపోయావ్, మీ మామ బాలయ్య అసెంబ్లీ వదిలి పారిపోయాడు. చంద్రబాబు గజదొంగ అని అసెంబ్లీ సాక్షిగా నిరూపించడానికి మేం సిద్ధం... కాదని నిరూపించే ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే అసెంబ్లీకి మీలో ఎవరు వస్తారో రండి...  ఇది మా వైసీపీ సవాల్’’ అంటూ రోజా ఎక్స్ లో స్పందించారు.

మరిన్ని వార్తలు