సీఎం జగన్‌ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏరియల్‌ సర్వే చేశారు: మంత్రి వేణు

18 Jul, 2022 13:59 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీ వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, భారీ వరదలు వచ్చినా అదృష్టం కొద్దీ ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. 

వరద ప్రభావిత ఐదు జిల్లాల్లో 191 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ‘‘వలంటీర్‌ వ్యవస్థ నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ బాగా పని చేశారు. సహాయక చర్యలపై ఎల్లోమీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయి. 

గత ప్రభుత్వంలో చంద్రబాబులా హెలికాప్టర్‌లో విహార యాత్ర చేయలేదు. సీఎం జగన్‌ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏరియల్‌ సర్వే చేశారు. చంద్రబాబు హయాంలో వర్షాలు లేవు.. ఎప్పుడూ కరువే. ప్రజాగ్రహంలో చంద్రబాబు కొట్టుకుపోయారు’’ అని మంత్రి వేణు  గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు