ఆ పాదయాత్రకు చంద్రబాబే డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌: మంత్రి రజిని

18 Sep, 2022 17:55 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, గుంటూరు: మూడు రాజధానులు ప్రభుత్వ విధానం అని మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్‌ ఆకాంక్ష అన్నారు. మూడు రాజధానుల వల్ల ఉపయోగాలెంటో సీఎం అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారన్నారు.
చదవండి: వింత మనుషులు.. చీకటి గదిలో నుంచి వెలుగులోకి..

రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రకు చంద్రబాబే డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ అంటూ దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీల ద్వారా  కొత్తగా 750 సీట్లు పెరగనున్నాయి. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురావాలనే ఆలోచన కూడా చేయలేదని’’ మంత్రి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు