నిమ్మగడ్డపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

30 Jan, 2021 19:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయ్యింది. పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిమ్మగడ్డకు ఈ నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిమ్మగడ్డకు మెయిల్ ద్వారా నోటీస్ పంపారు. ఎస్‌ఈసీ గవర్నర్‌కి లేఖ రాసి.. మీడియాకి లీక్ చేసి తమ ప్రతిష్టకు భంగం కలిగించారని మంత్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్‌ఈసీకి జారీ చేసిన నోటీసులపై స్పీకర్‌ తమ్మినేని నిర్ణయం తీసుకోనున్నారు. మా హక్కులకు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించించే విధంగా తమపై ఆరోపణలు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్లు మంత్రి  బొత్స సత్యనారాయణ శనివారం మీడియా ద్వారా వెల్లడించారు. తాము లక్ష్మణరేఖ దాటామని నిమ్మగడ్డ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

>
మరిన్ని వార్తలు