దేవినేని ఉమా డ్రామాలాడుతున్నారు: వసంత కృష్ణ ప్రసాద్

28 Jul, 2021 14:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డ్రామాలాడుతున్నాడని మైలవరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా వల్లే అనర్థాలు జరిగాయని మండిపడ్డారు. దేవినేని ఉమా అధికారంలో ఉన్నప్పుడు రెవిన్యూ భూములని, ఇప్పుడు ఫారెస్ట్‌ భూములని ఆరోపిస్తున్నాడాని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని ఉమా చూస్తున్నాడని దుయ్యబట్టారు. దేవినేని ఉమా దౌర్జన్యాలు, డ్రామాలు అందరికీ కనిపిస్తున్నాయన్నారు.

‘ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నాడు. దేవినేని ఉమాను ప్రశ్నిస్తే దాడి అంటాడు. తూర్పు, పడమర తెలియని వ్యక్తి లోకేష్. ఉమా వెకిలి చేష్టలతో టీడీపీ కార్యకర్తలే విసిగిపోయి ఎదురుతిరుగుతున్నారు. తెలుగు దేశం పార్టీ కాదు.. పక్కా తెలుగు దొంగల పార్టీ. 2014 నుంచి ఎలా క్వారీ జరిగిందో అన్నీ లెక్కలు తీస్తాం. అక్రమ మైనింగ్‌ చేసిందెవరో నిగ్గు తేల్చి ప్రజల ముందుపెడతాం’ అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు