నిమ్మగడ్డ ఇకనైనా మొండి వైఖరి విడనాడాలి

11 Jan, 2021 20:41 IST|Sakshi

విజయవాడ : ఎన్నికల షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మా ఆవేదనను న్యాయస్థానం ఆలకించి న్యాయం చేసిందని, ప్రజారోగ్య పరిరక్షణకే న్యాయమూర్తి మొగ్గు చూపారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తన మొండి వైఖరి విడనాడాలని, కోర్టు తీర్పును గౌరవించి ఎన్నికల ప్రక్రియకు పులుస్టాప్ పెట్టాలని చెప్పారు. (నిమ్మగడ్డకు షాక్‌! పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రద్దు )

వాక్సినేషన్ పంపిణీ అనేది చాలా పెద్ద ప్రక్రియ అని, అందరికీ వాక్సినేషన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాల్సిందిగా కోరారు. అధే విధంగా విధుల నుంచి తొలగించిన జాయింట్ డైరెక్టర్ సాయి ప్రసాద్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలుగు దేశం పార్టీ నాయకులు ఉద్యోగుల జోలికొస్తే నామరూపాల్లేకుండా పోతారని, ఎస్‌ఈసీ మళ్ళీ మొదటికొస్తే సమ్మెకు దిగేందుకు కూడా వెనకాడమని సవాల్‌ విసిరారు. (నిమ్మగడ్డ రాజీనామాకు మంత్రి కొడాలి నాని డిమాండ్‌ )

మరిన్ని వార్తలు