‘ఆయన వెనుక ఏ దుష్టశక్తి ఉంది..?’

12 Jan, 2021 13:07 IST|Sakshi

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన రాజకీయ క్రీడ జరుగుతోందని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగ పదవులను కొంతమంది అపహాస్యం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ‘‘కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కొన్ని దేశాల్లో ఇంకా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్‌ తెలిపారు. అయినా ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇవ్వటం దారుణమని’’ స్పీకర్‌ తప్పుపట్టారు. (చదవండి: బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌)

ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా.. నోటిఫికేషన్‌ ఇవ్వడం వెనుక ఉన్న ఏ దుష్టశక్తి ఉందని ఆయన ప్రశ్నించారు.న్యాయస్థానం ప్రజల పక్షాన తీర్పు చెప్పిందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇంత రాద్ధాంతం ఎందుకని, ఓ రాజకీయ పార్టీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోందని స్పష్టమవుతోందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.(చదవండి:హైకోర్టు తీర్పు శుభపరిణామం)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు