AP: జెడ్పీ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ

25 Sep, 2021 18:05 IST|Sakshi

అనంతపురం: నూతనంగా ఎన్నికైన 62 జడ్పీటీసీల ప్రమాణస్వీకారం పూర్తి అయింది. జడ్పీ కో-ఆప్షన్ సభ్యులుగా ఫయాజ్ వలి, అహ్మద్ బాషా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఏపీ ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ నదీం అహ్మద్, ఏపీ నాటక అకాడమీ ఛైర్ పర్సన్ హరిత పాల్గొన్నారు. 

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పరిషత్ వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల కోలాహలం నెలకొంది. మొత్తం 38 స్థానాలకు గాను 36 మంది జడ్పీటీసీ అభ్యర్థులు వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించారు. జిల్లా పరిషత్ ఛైర్‌ పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులు కూడా వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. ఈ సందర్భంగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ఇదంతా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ ఫలాలు అందించిన విజయంగా పేర్కొన్నారు. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు  మాట్లాడుతూ.. ముఖ్యంగా ఈ సారి జడ్పీ చైర్ పర్సన్ పదవి గిరిజన ప్రాంతానికి దక్కడంతో సంతోషంగా ఉందన్నారు.

 వైఎస్సార్‌ కడప జిల్లా పరిషత్ కో అప్షన్ సభ్యులుగా ఇద్దరు మైనారిటీలకు అవకాశం.

 కరీముల్లా, షేక్ అన్వర్ బాష లను కో అప్షన్  మెంబర్లుగా ఏకగ్రీవ ఎన్నిక. ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయరామ రాజు.

జిల్లాల వారీగా జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్నది వీరే..


అనంతపురం జిల్లా: బోయ గిరిజమ్మ (బీసీ)


 చిత్తూరు జిల్లా: శ్రీనివాసులు ( బీసీ)


 తూర్పు గోదావరి జిల్లా: వేణుగోపాల్‌ రావు (ఎస్సీ) 


 పశ్చిమ గోదావరి జిల్లా: కవురు శ్రీనివాస్‌ (బీసీ)


 గుంటూరు జిల్లా: హెనీ క్రిస్టినా( ఎస్సీ)


 కర్నూలు జిల్లా: వెంకట సుబ్బారెడ్డి( ఓసీ)


కృష్ణా జిల్లా: ఉప్పాళ్ల హారిక( బీసీ)


 నెల్లూరు జిల్లా: ఆనం అరుణమ్మ( ఓసీ)


 ప్రకాశం జిల్లా: వెంకాయమ్మ (ఓసీ)


► వైఎస్సార్‌ కడప జిల్లా: ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి (ఓసీ)


► విశాఖపట్నం జిల్లా: జల్లిపల్లి సుభద్ర (ఎస్టీ)


 విజయనగరం జిల్లా: మజ్జి శ్రీనివాసరావు (బీసీ)


► శ్రీకాకుళం జిల్లా: విజయ( సూర్య బలిజ) 

మధ్యాహ్నం 3 గంటకు జడ్పీ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. జడ్పీ ఎ‍న్నికలకు ప్రిసైడింగ్‌ అధికారిగా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. కలెక్టర్లు జడ్పీ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్‌తో ప్రమాణం చేయుంచనున్నారు.

► కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జడ్పీ కార్యాలయం వరకు వైఎస్సార్‌సీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్న ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సీఎం అంజాద్ బాష, చీఫ్ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

► కోఆప్షన్ సభ్యుల నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక శనివారం మధ్యాహ్నం జరగనుంది. అందులో భాగంగా ముందుగా కోఆప్షన్ సభ్యుల నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట​​కు జడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

చిత్తూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా శ్రీనివాసులు( వి.కోట జడ్పిటీసీ), తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా విపర్తి వేణుగోపాల రావు(పి.గన్నవరం జడ్పీటీసీ), అనంతపురం జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌గా బోయ గిరిజమ్మ (ఆత్మకూరు జెడ్పీటీసీ), వైఎస్సార్‌ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఎన్నిక కానున్నారు. 

కృష్ణా జిల్లాలో జడ్పీ ఛైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బీసీ మహిళ జడ్పీ పీఠాన్ని అధిష్టించనున్నారు. 13 జిల్లాల్లో చైర పర్సన్‌, ప్రతి జిల్లాకు ఇద్దరు వైస్‌ చైర్‌ పర్సన్లకు ఎన్నిక జరగనుంది.13 జిల్లా పరిషత్‌లు వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 శాతానికిపైగా పదవులు దక్కనున్నాయి. నూరుశాతం జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడం దేశంలోనే ఇదే ప్రథమం.

మరిన్ని వార్తలు