ఏపీకి ఇద్దరు గాంధీలు.. చంద్రబాబు, లోకేష్‌: పోసాని సెటైర్లు

2 Oct, 2023 12:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబు, లోకేష్‌ నాశనం కావడానికి భువనేశ్వరే కారణమని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి విమర్శించారు. భువనేశ్వరి, బ్రాహ్మణి వ్యాఖ్యలు సరైనవి కావని మండిపడ్డారు. ఆ మాటలు విని షాక్‌కు గురైనట్లు తెలిపారు. చంద్రబాబుకు కాంగ్రెస్‌ రాజకీయ భిక్ష పెట్టిందని దుయ్యబట్టారు. 

తండ్రిపై చెప్పులు వేయించినా భువనేశ్వరి ఏం అనలేదు
భువనేశ్వరి కోసం ఎన్టీఆర్‌ చంద్రబాబును పార్టీలో చేర్చుకున్నారని ప్రస్తావించారు. ఇందుకు ఎన్టీఆర్‌ టీడీపీ సీనియర్‌ నేతలను ఒప్పించారని గుర్తుచేశారు. అంత సాహసం చేసి బాబును పార్టీలోకి తీసుకొచ్చిన తండ్రిపై చెప్పులు వేయించినా భువనేశ్వరి చూస్తూ ఊరుకున్నారని మండిపడ్డారు. భారతదేశానికి ఒకరే గాంధీ. కానీ ఏపీకి మాత్రం ఇద్దరు గాంధీలు ఉన్నారని.. ఒకరు చంద్రబాబు మరొకరు లోకేష్ అంటూ సెటైర్లు వేశారు.

భర్తలను మించిన రాజకీయ నాయకురాళ్లు
భర్తలను మించిన రాజకీయ నాయకురాలు ఉన్నారంటూ నారా భువనేశ్వరి, బ్రహ్మణిలను ఉద్ధేశిస్తూ పోసాని వ్యాఖ్యానించారు. అత్తా కోడళ్ళు ఇద్దరూ భర్తల కంటే పెద్ద రాజకీయ నాయకురాళ్లని ఎద్దేవా చేశారు.  భర్తలను తిట్టారనే విషయం మర్చిపోయి... వచ్చే ఎన్నికల్లో అత్తాకోడళ్లు పవన్ మద్దతు కోరారని విమర్శించారు.

జ్యూస్‌ ఇవ్వగానే టీడీపీకి మద్దతు
చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీ వెళ్ళేటప్పుడు మనకేం కర్మ అని భువనేశ్వరి ఎందుకు అడ్డుకోలేదు?. చంద్రబాబు దొంగ అని ఆనాడే నాదేండ్ల భాస్కర్ రావు అన్నారు. తండ్రిని చెప్పుతో కొడితే భువనేశ్వరి చుక్క కన్నీరు కార్చలేదు. సమసామాజిక స్థాపన పేరుతో పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టారు. ఆనాడు ఒకమాట ఇవాళ మరో మాట మాట్లాడుతున్నారు. ఆయన అమాయకుడు. భువనేశ్వరి, బ్రహ్మని జ్యూస్‌ ఇవ్వగానే టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఎన్టీఆర్‌ను ఒంటరి వాడిని చేసి, ఆయన్ను మోసం చేసి చావడానికి కారణం అయిన వాళ్లు దండం పెట్టగానే.. అభయం ఇచ్చేశాడు. 
చదవండి: పవన్‌ ఫ్లాప్‌.. చంద్రబాబు జిమ్మిక్కే!

అభివృద్ధి చేసిన వాళ్ళను గెలిపించండి
పవన్‌కు వ్యక్తిత్వం ఉంటే పోటీలో ఒంటరిగా నిలబడాలి. సీఎం జగన్‌ వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. అందుకే కులం, మతం లేదు. పవన్‌ వైస్సార్‌సీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడం మానేసి.. తనకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలి తనను గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తానని పదేళ్లలో ఎక్కడైనా చెప్పారా?. వైఎస్‌ జగన్‌ మొదటి రోజు నుంచి ప్రజల అభివృద్ధి గురించే మాట్లాడారు. పవన్‌ కనీసం కాపులకు అండగా ఉంటానని కూడా చెప్పలేదు. కాపులు ఎవరికైనా ఓట్లు వేయండి చంద్రబాబుకు తప్ప. మీరు ఎవరి మైకంలోకి వెళ్ళకండి. ఎవరు మంచి అభివృద్ధి చేస్తే వాళ్ళను గెలిపించండి. ఇప్పటికే చాలా సార్లు మోసపోయారు. ఇక భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ కావొద్దు.

అప్పుడు సత్యమేవ జయతే ఎక్కడ పోయింది?
వైఎస్‌ జగన్‌ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడు సత్యమేవ జయతే ఎక్కడ పోయింది? సత్యమేవ జయతే కాదు. అసత్యమేవ అజయతే అని బోర్డు పెట్టుకోవాలి. హెరిటేజ్ పెట్టింది మా సినిమా లెజెండ్ కానీ ఇప్పుడు నారావారి అధీనంలో ఉన్నది. పాలిటిక్స్ అంటే డబ్బులు సంపాదించుకోవచ్చు అనే కొటేషన్ చంద్రబాబుకు కరెక్ట్‌గా సరిపోతుంది. 

చంద్రబాబును చెప్పుతో కొట్టినప్పుడు ఈ సత్యమేవ జయతే దీక్షలు ఎక్కడికి పోయాయి? జయప్రద లాంటి వాళ్ళు ప్రజాసేవ కోసం వస్తే వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే మంచి లేదంటే అక్రమ కేసులా? ఏపీలో జగన్‌ ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు. సీఎం జగన్‌ ఏనాడు కోర్టును ప్రశ్నించలేదు’ అని పోసాని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు