బీజేపీ ఇన్‌చార్జీ కమిటీల నియామకం

10 Sep, 2023 02:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీ వివిధ కమిటీల నియామకాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే కొన్ని కమిటీలను ఏర్పాటు చేయగా తాజాగా 17 లోక్‌సభ స్థానాలకు ‘పార్లమెంట్‌ ప్రభారీలు’ (ఇన్‌చార్జీలు), 33 జిల్లాలకు ఇన్‌చార్జీలను నియమించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆయా కమిటీల సభ్యలను నియమించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పార్లమెంట్‌ ప్రభారీలు వీరే...
ఆదిలాబాద్‌–అల్జాపూర్‌ శ్రీనివాస్, పెద్దపల్లి–విశ్వవర్ధన్‌రెడ్డి, కరీంనగర్‌–పి.గంగారెడ్డి, నిజామాబాద్‌–వెంకటరమణి, జహీరాబాద్‌–బద్దం మహిపాల్‌రెడ్డి, మెదక్‌–ఎం.జయశ్రీ, మల్కాజిగిరి–ఎ.పాపారావు, సికింద్రాబాద్‌–దేవకి వాసుదేవరావు, హైదరాబాద్‌–గోలి మధుసూదన్‌రెడ్డి, చేవెళ్ల–పి,సుగుణాకరరావు, మహబూబ్‌నగర్‌–వి.చంద్రశేఖర్, నాగర్‌కర్నూల్‌– ఎడ్ల ఆశోక్‌రెడ్డి, నల్లగడొండ–చాడ శ్రీనివాసరెడ్డి, భువనగిరి–అట్లూరి రామకృష్ణ, వరంగల్‌–వి.మురళీథర్‌గౌడ్, మహబూబాబాద్‌–ఎన్‌.వెంకటనారాయణరెడ్డి, ఖమ్మం–కడగంచి రమేశ్‌.

జిల్లా ఇన్‌చార్జీలు వీరే...
ఆదిలాబాద్‌–బద్దం లింగారెడ్డి, నిర్మల్‌–ఎం. మల్లారెడ్డి, కొమురం భీమ్‌–ఎం.మహేశ్‌బాబు, నిజామాబాద్‌–కళ్లెం బాల్‌రెడ్డి, కామారెడ్డి–ఎర్ర మహేశ్, కరీంనగర్‌– మీసాల చంద్రయ్య, జగిత్యాల– చంద్రశేఖర్, పెద్దపల్ల–రావుల రాంనాథ్, రాజన్న సిరిసిల్ల–జి.మనోహర్‌రెడ్డి, సంగారెడ్డి–జె.రంగారెడ్డి, మెదక్‌–డా.ఎస్‌.మల్లారెడ్డి, రంగారెడ్డి రూరల్‌–పి.అరుణ్‌ కుమార్, వికారాబాద్‌–వి.రాజవర్ధన్‌రెడ్డి, మేడ్చల్‌ అర్బన్‌–గిరిమోహనశ్రీనివాస్, మేడ్చల్‌ రూరల్‌– వి.నరేందర్‌రావు, నల్లగొండ–ఆర్‌.ప్రదీప్‌కుమార్, యాదాద్రి– జె.శ్రీకాంత్, మహబూబ్‌నగర్‌ కేవీఎల్‌ఎన్‌ రెడ్డి, వనపర్తి–బోసుపల్లి ప్రతాప్, నాగర్‌కర్నూల్‌–టి.రవికుమార్, గద్వాల–బి.వెంకటరెడ్డి, నారాయణపేట–కె.జంగయ్య యాదవ్, హనుమకొండ–అడ్లూరి శ్రీనివాస్, వరంగల్‌– కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, భూపాలపల్లి–ఎస్‌.ఉదయ్‌ ప్రతాప్, జనగామ–యాప సీతయ్య, మహబూబాబాద్‌–బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ములుగు– ఎ.వెంకటరమణ, ఖమ్మం–ఎస్‌.విద్యాసాగర్‌రెడ్డి, కొత్తగూడెం–ఆర్‌.రుక్మరాజు, గోల్కొండ–గోషామహల్‌–ఎస్‌.నందకుమార్‌యాదవ్, మహంకాళి–సికింద్రాబాద్‌–నాగూరావు నామాజీ, హైదరాబాద్‌ సెంట్రల్‌– టి.అంజన్‌కుమార్‌గౌడ్‌. 
 

మరిన్ని వార్తలు