నేను నలుపే.. కానీ నా ఆలోచనలు తెలుపు: సీఎం

2 Dec, 2021 17:34 IST|Sakshi

న్యూఢిల్లీ: 200 ఏళ్ల తెల్ల వారి పాలనలో మగ్గిన ఫలితమో.. లేక పాశ్చత్య సంస్కృతి మీద మోజో తెలీదు కానీ మన వారికి తెల్లని శరీర ఛాయ అంటే మహా మోజు. నల్లగా ఉన్న వారిని అంటరాని వారిగా చూస్తారు. శాస్త్ర సాంకేతికపరంగా ఎంత ఎదిగినా.. సంస్కారం పరంగా మరింత దిగజారిపోతున్నాం. ఇక నల్లని శరీర ఛాయ ఉన్న వారు ఎదుర్కొనే అవమానాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. 

తాజాగా ఈ జాబితాలోకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేరారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఆమ్‌ ఆద్మీ పార్టీని ఉద్దేశించి.. నల్ల ఆంగ్లేయులు అని సంబోధించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
(చదవండి: ప్రతి మహిళకు నెలకు రూ.వేయి ఇస్తాం.. సీఎం ప్రకటన)

వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బరిలో దిగేందుకు ఆప్‌ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగా పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బుధవారం ప్రసంగిస్తూ.. ‘‘కేజ్రీవాల్‌ చర్మం రంగు నలుపు. కానీ ఆయన తన ఆలోచనలు న్యాయపరమైనవని చెప్పడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. 2022లో గెలవడానికి నల్ల ఆంగ్లేయులు తెగ ప్రయత్నిస్తున్నారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
(చదవండి: గతంలో నేనూ ఆటో డ్రైవర్‌నే.. పెండింగ్‌ చలాన్లు రద్దు చేస్తా: సీఎం)

చన్నీ వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ‘‘నేను నలపు కావొచ్చు. కానీ నా ఆలోచనలు మాత్రం తెలుపు.. అంటే స్వచ్ఛంగా ఉంటాయి’’ అని తెలిపారు. తిరంగ యాత్రలో భాగంగా పఠాన్‌కోటలో పర్యటిస్తున్న కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘నేను వారికి (కాంగ్రెస్) ఒక విషయం సూటిగా చెప్పాలనుకుంటున్నాను. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాధారణ దుస్తులు ధరించి, నల్లగా ఉన్న వ్యక్తి అన్ని హామీలను నెరవేరుస్తాడని తెలుపుతున్నాను. నేను తప్పుడు ప్రకటనలు, తప్పుడు వాగ్దానాలు చేయను’’ అని తెలిపారు.

చదవండి: మీకు నేనున్నా.. హామీ ఇస్తున్నా: కేజ్రీవాల్‌

మరిన్ని వార్తలు