చైనా ముందు మోకరిల్లిన మోదీ సర్కారు: అసదుద్దీన్‌ 

26 Aug, 2023 04:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చైనా ముందు మోదీ సర్కార్‌ మోకరిల్లుతోందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. లద్దాఖ్‌ సరిహద్దులో ఏం జరుగుతుందో దేశప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ భారత వీర సైనికులు 40 నెలలుగా సరిహద్దులో చైనీయులకు భయపడకుండా నిలబడ్డారన్నారు.

మరి మోదీ ఎందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఎదురొడ్డి నిలబడలేకపోతున్నారని ప్రశ్నించారు.  ది కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రం అవార్డుకు ఎంపిక చేయడం పట్ల అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు.   

మరిన్ని వార్తలు