కమల్‌తో అసద్‌.. దోస్తీ!

15 Dec, 2020 03:46 IST|Sakshi

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌హాసన్‌ పార్టీతో మజ్లిస్‌ పొత్తు

మైనార్టీలు ఎక్కువగా ఉన్న 25 నియోజకవర్గాల్లో పోటీ

ఏకతాటిపైకి ముస్లిం పార్టీలు!

సాక్షి హైదరాబాద్ ‌: తమిళనాట పతంగి ఎగిరేనా? కమల్‌తో కలిసి కమాల్‌ చేయగలదా? మజ్లిస్‌ పార్టీ అక్కడ కూడా అడుగు పెట్టగలదా? ఈ ప్రశ్నలంటికీ వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే సమాధానమిస్తాయి. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. బిహార్‌ అసెంబ్లీ, గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తా చాటిన ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. మక్క ల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, సినీనటుడు కమల్‌ హాసన్, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మధ్య ‘పొత్తు’పొడిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరూ జట్టుగా, కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పో టీ చేయనున్నారని, ప్రాథమికంగా ఓ అంచనాకు కూడా వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఎంఐఎం నేతలతో అసద్‌ సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపునకు  అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్‌ సోమవారం ప్రకటించారు. అయితేతా ము పోటీ చేసే నియోజకవర్గాలపై త్వరలోనే స్పష్టతనిస్తావన్నారు. జనవరి మా సాంతంలో ఒవైసీ చెన్నైకి వెళ్లి, పొత్తుకు తుది రూపం ఇవ్వనున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాట 25 సీట్లలో పోటీ చేయాలని, ఈ స్థానాల్లో కమల్‌తో పొత్తు పెట్టుకోవాలని అసద్‌ నిర్ణయించుకున్నారని సమాచారం.

అక్కడ మజ్లిస్‌ పాగా వేసేనా?
ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని అసద్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్‌కు చెంది న నేతలతో హైదరాబాద్‌లో శనివారం భేటీ అయిన ఒవైసీ ఫలవంతమైన చ ర్చలు జరిగాయంటూ ట్వీట్‌ చేశారు. ఇక తమిళనాట మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. 

ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి 
బిహార్‌ ఎన్నికల్లో గెలిచినట్లుగానే తమిళనాట కూడా విజయం సాధించాలని ఒవైసీ భావిస్తున్నారు. అయితే తమిళనాట ఇప్పటికే అనేక ముస్లిం పార్టీలున్నాయి. వాటన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని ఒవైసీ భావిస్తున్నట్లు తెలు స్తోంది. ‘అన్ని ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో నిలబడాలని ఒవైసీ భావిస్తున్నారు. కమల్‌ పార్టీ, ఇతర చిన్న పార్టీలతో ఒవైసీ పొత్తు పెట్టుకుంటారు’ అని మజ్లిస్‌ వర్గాలు పేర్కొన్నాయి.   

మరిన్ని వార్తలు