ఆజాద్‌పై ఆరోపణలు.. ఒవైసీ స్పందన

24 Aug, 2020 21:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ నాయకత్వానికి సంబంధించి విభేదాలు బయటపడిన నేపథ్యంలో సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో సీనియర్‌ నేతల మధ్య వాడివేడి చర్చ జరిగిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి సీనియర్ల లేఖ బీజేపీ కుట్రలో భాగంగా కనిపిస్తోందని ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యాఖ్యలపై సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఆయన రాజీనామాకు సైతం సిద్ధపడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ వార్తలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇంకెన్నాళ్లు కాంగ్రెస్‌ నాయకత్వంలో బానిసలుగా ఉంటారంటూ ఒవైసీ, ఆజాద్‌ను ప్రశ్నించారు. పొయెటిక్‌ జస్టిస్‌ అంటూ వ్యాఖ్యానించారు. 

‘ఆజాద్‌ కొన్నేళ్ల క్రితం మీరు ఇదే విషయం గురించి నాపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీరు అవే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మీరు మమ్మల్ని బీజేపీ బీ జట్టు అన్నారు. ఇప్పుడు మీ పార్టీ నేతలే మీరు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌లోని ముస్లిం నాయకులు సమయం వృధా చేస్తున్నారు. ఇంకా ఎంత కాలం ఇలా కాంగ్రెస్‌ నాయకత్వానికి బానిసలుగా ఉంటారో ఆలోచించుకోండి’ అంటూ ఒవైసీ సంలచన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు