టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదు: అసదుద్దీన్‌ ఒవైసీ

22 Nov, 2020 14:18 IST|Sakshi

52 స్థానాల్లో పోటీ చేస్తున్నాం..

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 52 స్థానాల్లో పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు. చాలా చోట్ల టీఆర్‌ఎస్సే తమకు పోటీ అని తెలిపారు. హైదరాబాద్‌కు భారీ వరద వస్తే కేంద్రం సాయం చేయలేదని ఆయన విమర్శించారు. బీజేపీ హిందూత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ముస్లింలకు లేదా?’ అని అసదుద్దీన్ పశ్నించారు. (చదవండి: టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్‌షీట్‌)

అసదుద్దీన్‌ ఒవైసీతో కేసీఆర్‌  గురువారం  భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రగతిభవన్‌ వేదికగా సాగిన వీరి సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. గత ఎన్నికల్లో మొత్తం 150 సీట్లకు గాను టీఆర్‌ఎస్‌ 99, ఎంఐఎం 40 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయా, లేక విడివిడిగా పోటీ చేస్తాయా అన్న సందిగ్ధతకు ఒవైసీ తెర దించారు.

మరిన్ని వార్తలు