గెహ్లాత్‌ ఎత్తుగడ: గవర్నర్‌ ముందు కొత్త ప్రతిపాదన

26 Jul, 2020 14:12 IST|Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌ రాజకీయం పూటకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని పట్టుపట్టిన ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ తాజాగా మరో​ కొత్త ఎత్తుగడ వేశారు. ఆదివారం గవర్నర్‌కు రాసిన లేఖలో జూలై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణ, పరీక్షలు, సహా వివిధ అంశాలపై చర్చించాలని అజెండాలో వివరించారు. కానీ బలపరీక్ష అంశం అజెండాలో మాత్రం ప్రస్తావించలేదు. దీనిపై గవర్నర్‌ తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే గవర్నర్‌కు సమర్పించిన లేఖ బలపరీక్ష అంశం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఆదివారం కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం  అజెండాను తయారుచేసి గవర్నర్‌కు అందించారు. (ప్రధాని ఎదుట ధర్నా చేస్తాం)

వ్యూహంలో భాగంగా సీఎం కొత్త ఎత్తుగడ వేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు కల్‌రాజ్‌మిశ్రాతో భేటీ అయిన గెహ్లాత్‌ ఫోర్ల్‌టెస్ట్‌కు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. గవర్నర్‌ ఎంతకీ స్పందించకపోవడంతో శుక్రవారం రాజ్‌భవన్‌ ముందు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో సంక్షోభం సమసిపోయేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కలిసి కోరుతామనీ, అవసరమైతే ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేపడతామన్నారని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ నేత వెల్లడించారు. (వేడి రగిల్చిన పైలట్‌​ దారెటు?)

మరిన్ని వార్తలు