‘సినిమాలో జోకర్‌నే.. నిజజీవితంలో హీరోని’

6 Feb, 2021 14:27 IST|Sakshi
జోగిపేటలో నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న బాబూమోహన్‌

మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు బాబూమోహన్‌ 

జోగిపేట(అందోల్‌): నేను సినిమాలో జోకర్‌నే.. జోకర్‌గా 1027 సినిమాలో నటించానని, నంది అవార్డు కూడా వచ్చిందని, నిజజీవితంలో మాత్రం హీరోనని మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ నాయకుడు బాబూమోహన్‌ అన్నారు. శుక్రవారం జోగిపేటలో రామందిర నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. తనను  జోకర్‌ అని సంబోధిస్తూ సోషల్‌మీడి యాలో రావడంతో ఆయన స్పందించారు. కళాకారుడిగా జోకర్‌గా నటించానన్నారు. తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించినా దామోదర్‌ రాజనర్సింహను ఒక్క సారి వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నారు.   

 రామందిర నిర్మాణానికి విరాళాల సేకరణ 
జోగిపేట పట్టణంలో రామ మంది నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక వ్యాపారస్తుల వద్దకు వెళ్లి విరాళాలలను సేకరించారు. స్థానిక సుప్రభాత్‌ హోటల్‌ యజమాని విజయ్‌ రూ.5వేల చెక్కును అందజేశారు. తాము సేకరించిన నిధి నేరుగా రామ మందిర ట్రస్టుకు వెళ్తుందన్నారు. మండల బీజేపీ అధ్యక్షుడు నవీన్, పట్టణ అధ్యక్షుడు సయ్య సాయికుమార్, జిల్లా ఓబీసీ మోర్చా  కార్యదర్శి వెంకట రమణ, మాజీ పట్టణ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, జిల్లా నాయకులు జగన్నాథం పట్టణ నాయకులు మహేష్కర్‌ సుమన్, సుజీత్, పుల్కల్‌ మండల కార్యదర్శి శేఖర్‌గౌడ్, మండల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు