Badvel By Election Results 2021: బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ భారీ విజయం

2 Nov, 2021 18:21 IST|Sakshi

Live Updates:

Time: 12:45 PM: బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 90,533ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ  విజయం సాధించారు.

Time: 12:24 PM
13 వ రౌండ్లో వైఎస్సార్‌సీపీకి 362 ఓట్లు, బీజేపీకి 40 ఓట్లు, కాంగ్రెస్‌కు 12 ఓట్లు పోల్‌ అయ్యాయి. మొత్తంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ 90,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

Time: 12:20 PM
12వ రౌండ్లోనూ ‘ఫ్యాన్‌’ హవా కొనసాగింది. ఈ రౌండ్లో 483 ఓట్ల ఆధిక్యం సాధించిన వైఎస్సార్‌సీపీ మొత్తంగా 90,211 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపును సొంతం చేసుకుంది. అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్‌సీపీ 1,11,849 ఓట్లు, బీజేపీ 21,638 ఓట్లు, కాంగ్రెస్‌ 6,223 ఓట్లు సాధించాయి.

Time: 12:00 PM
ఇప్పటికే గెలుపు ఖాయం చేసుకున్న వైఎస్సార్‌సీపీ 11వ రౌండ్లోనూ సత్తా చాటింది. తాజా రౌండ్‌లో లభించిన 4584 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ 90,089 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ 1,11,710 ఓట్లు ,బీజేపీ 21,621 ఓట్లు, కాంగ్రెస్‌ 5968 ఓట్లు సాధించాయి. 

Time: 11:40 AM: బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 10 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ 85,505 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్‌సీపీ 1,06,088 ఓట్లు సాధించగా.. బీజేపీ 20,583, కాంగ్రెస్‌ 5968 ఓట్లు సాధించింది. అధికారికంగా మరో రౌండ్‌ ఫలితం వెలువడాల్సి వుంది.

Time: 11:31 AM: బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించింది. అధికారికంగా మరో మూడు రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి వుంది. 8 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ 68,492 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Time: 11:25 AM: బద్వేల్‌లో ఎనిమిదో రౌండ్‌ ముగిసింది. 8వ రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 9691, బీజేపీ 1964, కాంగ్రెస్‌కు 774 ఓట్లు పోలయ్యాయి. 68,492 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది.

Time: 11:14 AM: బద్వేల్‌ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది. వైఎస్సార్‌సీసీ 60,826 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారీ మెజార్టీ దిశగా డాక్టర్‌ దాసరి సుధ సాగుతున్నారు.

Time: 11:7 AM: బద్వేల్‌లో ఏడో రౌండ్‌ ముగిసింది. ఏడో రౌండ్‌లో వైఎస్సార్‌సీపీకి 10,726, బీజేపీకి 1924, కాంగ్రెస్‌కు 841 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లు ముగిసే సరికి వైఎస్సార్‌సీపీ 74991 ఓట్లు సాధించింది.

Time: 11:01 AM: బద్వేలులో ఆరో రౌండ్‌ ముగిసింది. ఆరో రౌండ్‌లో వైఎస్సార్‌సీపీకి 11,383, బీజేపీకి 1940, కాంగ్రెస్‌కు 531 ఓట్లు పోలయ్యాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌ వైఎస్సార్‌సీపీ 64,265 ఓట్లు సాధించింది.

Time: 10:45 AM: బద్వేల్‌లో ఆరో రౌండ్‌ ముగిసే సరికి 52,024 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీకి 64,265 ఓట్లు, బీజేపీకి 12,241 ఓట్లు పోలయ్యాయి.

Time: 10:45 AM: బద్వేల్‌లో భారీ విజయం దిశగా వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది. వైఎస్సార్‌సీపీ ఆధిక్యత 50 వేలు దాటింది.

Time: 10:38 AM: బద్వేల్‌లో ఆరో రౌండ్‌ ముగిసింది. 52,024 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది.

Time: 10:26 AM: భారీ విజయం దిశగా వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది. బద్వేల్‌లో ఐదో రౌండ్‌ ముగిసే సరికి 42,824 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది.

Time: 10:06AM: బద్వేలులో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. భారీ విజయం దిశగా డాక్టర్‌ దాసరి సుధ సాగుతున్నారు.

Time: 9:57 AM: నాలుగో రౌండ్‌ ముగిసే సరికి 30,412 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది.

Time: 9:36 AM: బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. మూడో రౌండ్‌ ముగిసే సరికి 23,754 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది.

Time: 9:30 AM: తొలి రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి.

Time: 9:03 AM: తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం..
Time: 8:36 AM: బద్వేల్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కలసపాడు మండలం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.

Time: 8:24 AM: పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కింపు..
Time: 8:00 AM: వైఎస్సార్‌ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 259 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉన్నాయి. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు.

మరిన్ని వార్తలు