చంద్రబాబు జాతి నాయకుడే

11 Mar, 2021 05:31 IST|Sakshi
రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు

జాతీయ నేత స్థాయినుంచి దిగజారిపోయారు

బహుజన పరిరక్షణ సమితి నేతల ధ్వజం

తాడికొండ: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు జాతీయస్థాయి నేతనుంచి జాతి నాయకుడిగా దిగజారిపోయారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 162వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు ప్రసంగించారు. 14 సంవత్సరాల సీఎం, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కుల నాయకుడిగా తయారై.. చరమాంకంలో అట్టర్‌ ఫ్లాప్‌ డ్రామాలాడుతున్నారని విమర్శించారు.  రాజధాని పేరిట దోచుకున్న సొమ్మును దాచుకునేందుకు ఎన్‌ఆర్‌ఐల చందాలతో ఉద్యమం పెట్టించి డ్రామా కంపెనీ మేనేజర్‌లాగా తయారయ్యాడని మండిపడ్డారు.  రాజధాని రైతులకు ఒక ఎజెండా లేకుండా దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు.

అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకుంటే పంచాయతీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఎందుకు ఓడించారో సమాధానం చెప్పి..అమరావతి ఉద్యమం కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. మూడు రాజధానుల రెఫరెండంగానే పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేశారనే నిజం తెలుసుకుని చంద్రబాబు ఆయన సుపుత్రుడు లోకేష్‌ రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని ఎల్లో మీడియాలో రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు నానా తంటాలు పడడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బహుజనుల రాజ్యాంగబద్ధ హక్కుల కోసం.. పోరాటంలో విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు