నా కుటుంబంపై కుట్ర జరుగుతోంది: బాలినేని

27 Jun, 2022 19:08 IST|Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: తనకు సంబంధం లేని విషయాలపై కొందరు గొడవ చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీని వెనుక టీడీ జనార్ధన్‌ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న చెన్నైలో పట్టుబడ్డ డబ్బుపై మరోసారి దుష్ప్రచారం చేశారన్నారు. తన కుటుంబంపై కుట్ర జరుగుతోందన్నారు. ఇకనైనా వారు పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే పదవి నుంచి తప్పకుంటానని బాలినేని సవాల్‌ విసిరారు.
చదవండి: చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్‌ ఓపెన్‌ సవాల్‌

మరిన్ని వార్తలు