Balka Suman: ఈటల ‘లేఖ’ నిజమే! 

27 Jun, 2021 08:11 IST|Sakshi

హుజూరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్‌ రాసినట్లు ఆయన లెటర్‌ ప్యాడ్‌తో ఉన్న లేఖ నిజమేనని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ స్పష్టం చేశారు. అయితే దానిని నకిలీ లేఖగా బీజేపీ ప్రచారం చేస్తోందని అన్నారు. ఈటల రాసిన లేఖ ఫేక్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేస్తారా? అని సవాల్‌ విసిరారు. శనివారం హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్‌ అధ్యక్షతన ఇక్కడ జరిగిన టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలు సరికాదని, పార్టీని, కేసీఆర్‌ను ఈటల మోసం చేశారని విమర్శించారు. బీజేపీ వాళ్లు తనను బానిసగా తిడుతూ విమర్శలు చేస్తున్నారని, వాళ్ల తిట్లను దీవెనగా భావిస్తానని పేర్కొన్నారు.  ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఈటల రాజేందరే సీఎం కావాలన్నప్పుడు వాళ్ల మాటలను ఈటల ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సమావేశంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సుధీర్‌కుమార్, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

వైరల్‌: ‘సీఎం కేసీఆర్‌కు ఈటల లేఖ’ కలకలం

మరిన్ని వార్తలు