నారా బ్రాహ్మణి మైండ్‌ గేమ్‌: బండి పుణ్యశీల

21 Oct, 2023 15:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నారా బ్రాహ్మణి ఆదేశాలతో ఐ టీడీపీ పనిచేస్తోందని, బ్రాహ్మణి మహిళ అయ్యి ఉండి సీఎం జగన్‌ కుటుంబ సభ్యులపై అసభ్యకర ప్రచారానికి తెరలేపిందని ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల మండిపడ్డారు.

సోషల్ మీడియాలో సీఎం సభ్యులపై ఐ టీడీపీ పెడుతున్న అసభ్యకర పోస్టింగ్‌లపై జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకు ఆమె ఫిర్యాదు చేశారు. విజయవాడ సీపీ కాంతి రానా టాటాకు ఫిర్యాదు బదిలీ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను పుణ్యశీల కోరారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని, బ్రాహ్మణి మైండ్ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు జైల్లో, లోకేష్ ఢిల్లీలో ఉండగా బ్రాహ్మణి చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తోంది. మామను మించిన కోడలిగా బ్రాహ్మణి తన తండ్రిని దూరం పెట్టింది. చంద్రబాబు జైలుకు వెళ్లాక బాలకృష్ణ ఎక్కడ పార్టీని నడిపిస్తారో అని బ్రాహ్మణి ముందుకు వచ్చింది. సీఎం జగన్ కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై పోరాడతాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది’’ అని పుణ్యశీల పేర్కొన్నారు.
చదవండి: పవన్‌ కల్యాణ్‌ కొత్త ప్లాన్‌.. బీజేపీ లొంగుతుందా?

మరిన్ని వార్తలు