ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడానికే 'ప్రజా సంగ్రామ యాత్ర': బండి సంజయ్‌

28 Aug, 2021 14:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా బీజేపీ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ శనివారం ఘనంగా ప్రారంభమైంది.  భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి.. పాదయాత్ర మొదలుపెట్లారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, ఇతర ముఖ్య నేతలు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్‌ 2వ తేదీ వరకు 36 రోజుల పాటు 'ప్రజా సంగ్రామ యాత్ర' పాదయాత్ర సాగనుంది. 

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ' తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన లేదు.. కుటుంబ పాలన ఉంది. తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడానికే పాదయాత్ర నిర్వమిస్తున్నాం. ప్రజా సంగ్రామయాత్రకు ప్రజల సహకారం కావాలి. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం.' అని తెలిపారు. 

► కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. 'ఉద్యమకారులను ఆకాంక్షకు విరుద్దంగా టీఆర్‌ఎస్‌ పాలన కొనసాగుతుంది. ఏళ్లయినా బంగారు తెలంగాణ కాలేదు. కల్వకుంట్ల కుటుంబం బంగారు కుటుంబంగా మారింది' అని పేర్కొన్నారు.

కేసీఆర్‌కు భయం మొదలైంది. హుజురాబాద్‌ ఎన్నిక వచ్చిందనే కేసీఆర్‌ నటిస్తున్నారు- డీకే అరుణ

► కేసీఆర్‌ రాజ్యం నుంచి తెలంగాణను రక్షిస్తాం- తరుణ్‌చుగ్‌

► కేసీఆర్‌ ప్రభుత్వం అవీనీతిలో మునిగిపోయింది- అరుణ్‌సింగ్‌

మరిన్ని వార్తలు