దుబ్బాక గెలుపు అతనికే అంకితం : బండి సంజయ్‌

10 Nov, 2020 17:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. 1470 ఓట్ల మెజార్టీతో సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్‌ విజయం సాధించారు. 23 రౌండ్లకు గాను 12 రౌండ్లల్లో బీజేపీ అధిక్యం సాధించింది. ఉత్కంఠ పోరులో విజయం సాంధించిన రఘునందన్‌కు అభినందనలు వెల్లువెత్తువెత్తున్నాయి.
(చదవండి : దుబ్బాక ఫలితాలపై స్పందించిన కేటీఆర్‌ )

దుబ్బాక గెలుపును ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆత్మహత్యకు పాల్పడిన కార్యకర్త గంగుల శ్రీనివాస్‌కు అంకితం చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఇందుకు ఉదాహరణ దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే అని ఆమె అన్నారు. ఈ గెలుపు తెలంగాణ మొత్తం ప్రభావం చూపుతుందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఈ గెలుపు దోహపడుతుందన్నారు. ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థి ప్రాధాన్యతగానే ఎన్నికలు జరుగుతాయని, అభ్యర్థి గెలుపును, పార్టీ గెలుపును విడదీయలేమని కిషన్‌రెడ్డి అన్నారు. 
(చదవండి : దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ)

మరిన్ని వార్తలు