Munugode By Election: తూచ్‌.. నేను అలా అనలేదు.. బ్రేకింగ్‌ పెట్టొద్దు: బండి సంజయ్‌

5 Aug, 2022 13:02 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారని తాను అనలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌  అన్నారు. అనని మాటను అన్నట్టు బ్రేకింగ్స్ పెట్టొదంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. నిధుల విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మోదీని కలుస్తుంటారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అన్నారు. చీకోటి వ్యవహారంలో కేసీఆర్‌ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయన్నారు.
చదవండి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి  షాకింగ్‌  కామెంట్స్‌ 

ఉప ఎన్నికలు కోరుకున్నదే సీఎం కేసీఆర్.. మళ్లీ వాళ్లే ఉప ఎన్నిక ఎవరు కోరుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. నాగార్జున సాగర్, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో 6 నెలల చొప్పున కేసీఆర్ టైం పాస్ చేశారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక పేరుతో మళ్లీ 6 నెలలు టైం పాస్ చేస్తారని’’ బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు