పీవీని కేసీఆర్‌ అవమానించారు: బండి సంజయ్‌

29 Jun, 2021 08:11 IST|Sakshi
పీవీకి నివాళులర్పిస్తున్న బండి సంజయ్‌

తూతూమంత్రంగా శతజయంతి నిర్వహించారని బండి సంజయ్‌ ఆరోపణ  

భీమదేవరపల్లి: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, వేడుకలను తూతూమంత్రంగా నిర్వహించి ఆయనను అవమానపర్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు.  వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మం డలంలోని ఆయన స్వగ్రామమైన వంగరను సోమ వారం సంజయ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పీవీ విగ్రహం వద్ద నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని గతంలో కేసీఆర్‌ చెప్పగానే ఒవైసీ సోదరుల్లో ఒకరు పీవీ ఘాట్‌ను కూలుస్తామని ప్రకటించాడని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌కు పీవీపై ప్రేమ ఉంటే అలాంటి మాటలన్నందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
చదవండి: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: కోమటిరెడ్డి


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు