'ఎన్ని యాగాలు చేసినా ఆయన పాపాలు పోవు'

8 Jan, 2021 12:09 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: కేసీఆర్‌ ఎన్ని యాగాలు చేసినా ఆయన చేసిన పాపాలు పోవని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సూర్యాపేట జిల్లాలో సంకినేని వెంకటేశ్వర రావు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 'కేసీఆర్‌ తెలంగాణకు పట్టిన వాస్తుదోషం. అమరవీరుల ఉసురు కేసీఆర్‌కు తగులుతుంది.

నాగార్జునసాగర్‌లో బీజేపీని ఎదుర్కోవడం కోసం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్‌ఎంసీలలో వచ్చిన ఫలితాలే నాగార్జునసాగర్‌లో వస్తాయి బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. కోవిడ్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయలేదు. ఉద్యోగ, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కేసీఆర్‌తో యుద్ధం చేస్తుంది. నాగార్జునసాగర్‌కు టీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదు. కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడి ప్రజలు తిప్పికొడతారు. నాగార్జున సాగర్‌లో గెలుపు బీజేపీదే' అని బండి సంజయ్‌ అన్నారు. చదవండి: (కేసీఆర్‌ పెద్ద తోపేం కాదు: బండి సంజయ్‌)

బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మోడీది విజయయాత్ర ఆగేది లేదు. రాష్ట్రమంతటా బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనపుడు కేసీఆర్‌ స్థానం ఎక్కడుంది. 2001లో టీడీపీ నుంచి కేసీఆర్‌ తన స్వార్థం కోసం బయటకి వచ్చి టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించడం జరిగింది. సీఎం కేసీఆర్‌ నటుడు రాజబాబు మాదిరిగా నటించేస్తున్నాడు. కేసీఆర్‌ కుర్చీని, సచివాలయాన్ని ఖాళీ చెయ్యాలి. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. రాష్ట్ర ప్రజల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని తరుణ్‌ చుగ్‌ పేర్కొన్నారు. చదవండి: (‘దమ్ముంటే నీ కన్న తల్లిపై ప్రమాణం చెయ్‌’)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు