‘కేసీఆర్‌ క్రోమో ఫోబియాతో ఇబ్బంది పడుతున్నారు’

19 Nov, 2022 13:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎంపీ అరవింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ను పెంచింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.. అరవింద్ కుటుంబ సభ్యులను బండి సంజయ్‌ పరామర్శించారు. అనంతరం, టీఆర్‌ఎస్‌పై సంచలన కామెంట్స్‌ చేశారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎంపీ అరవింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకు దాడి చేశారో వారికే తెలియదు. ఇంటిలో పగులగొట్టిన ఫర్నీచర్‌ గురించి మాకు పెద్దగా బాధ లేదు. నా మీద దాడి చేసినా నేను పట్టించుకోను. కానీ.. హిందూ దేవుళ్ల మీద దాడి చేశారు. పవిత్రంగా కొలిచే తులసీ మాత, లక్ష్మీ అమ్మవారు, దుర్గా మాత మీద దాడులు చేశారు. కేసీఆర్‌ క్రోమో ఫోబియాతో ఇబ్బంది పడుతున్నారు. టైమ్‌ గడుస్తున్న కొద్దీ టెన్షన్‌కు గురవుతున్నారు.

ఎంపీ అరవింద్‌ విమర్శ మాత్రమే చేశారు.. ఏదైనా బూతులు మాట్లాడారా?. దాడులు ఎవరు చేసినా మంచిది కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం అహంకారం ఏమిటో తెలంగాణ ప్రజలందరూ చూశారు. భవిష్యత్తు రోజుల్లో ప్రజలే టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధిచెబుతారు’ అని కామెంట్స్‌ చేశారు. 
 

మరిన్ని వార్తలు