కేసీఆర్‌ సర్కార్‌కు సంజయ్‌ సవాల్‌.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను!

29 Jan, 2023 14:35 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది. రాజకీయ నేతల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాగా, బండి సంజయ్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు మేము సిద్ధం. బీజేపీలో కోవర్టులు ఉండరు.. బీజేపీ సిద్ధాంతం గల పార్టీ. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణకు నాలుగో స్థానంలో ఉంది. ఒక్క రైతుబంధు ఇచ్చి మిగతా సబ్సిడీలను రద్దు చేశారు. పంజాబ్‌లో రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చారు. 24 గంటల విద్యుత్‌ను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?. అంటూ సవాల్‌ విసిరారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు