అతిథికి ఇచ్చే మర్యాద ఇదేనా.. తగిన గుణపాఠం​ చెబుతాము: బండి సంజయ్‌ వార్నింగ్‌

9 Sep, 2022 21:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో గణనాథుడి నిమజ్జనం సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలంగాణకు విచ్చేసిన విషయం తెలిసిందే. కాగా, పర్యటనలో భాగంగా హిమంత బిశ్వ శర్మ ఎంజే మార్కెట్‌లో ప్రసంగించారు. 

ఈ సందర్భంగా అసోం సీఎం.. కేసీఆర్‌ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణలో బీజేపీదే గెలుపు. ప్రతిపక్షాలు కలిసే ఉన్నాయి. కేసీఆర్‌ ఏకం చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వం నిజాం పాలనని కొనసాగిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. కుటుంబ పాలన నుండి విముక్తి కలిగాలని భాగ్యలక్ష్మీ అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. దీంతో, టీఆర్‌ఎస్‌ కార్యకర్త స్టేజీ మీదకు వచ్చి.. మైక్‌ లాక్కున్నాడు. దీంతో.. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య తోపులాట చేసుకుంది. 

తాజాగా ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ స్పందించారు. బండి సంజయ్‌ మీడియాతో​ మాట్లాడుతూ.. బీజేపీ నేతలను చూసి టీఆర్ఎస్‌ నేతలు భయపడుతున్నారు. ఇతర రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చిన అతిథికి ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నించారు. అసోం సీఎంను అడ్డుకుని ఏంచేయగలిగారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వరా.. బీజేపీ నేతలకు మంత్రి తలసాని కౌంటర్‌

మరిన్ని వార్తలు