బియ్యం బీజేపీవి.. ఫొటో కేసీఆర్‌దా: బండి

4 Aug, 2021 01:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం రేషన్‌ షాపుల వద్ద కేసీఆర్‌ ఫొటోలను ప్రదర్శిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేషన్‌ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫొటోలను పెట్టాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం కింద మోదీ ప్రభుత్వం పేదల కడుపు నింపేందుకు ఉచితంగా ఆహార ధాన్యాలను కేటాయించినప్పటికీ రాష్ట్ర సర్కార్‌ పూర్తి స్థాయిలో పేదలకు పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటని బండి విమర్శించారు.    

మరిన్ని వార్తలు