కేసీఆర్‌ పొర్లుదండాలు పెట్టినా వదిలేది లేదు 

3 Jan, 2021 08:17 IST|Sakshi

సీఎంపై బండి సంజయ్‌ ఫైర్‌ 

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం దగ్గర ఎన్ని పొర్లు దండాలు పెట్టినా అవినీతి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని ఏమాత్రం వదిలిపెట్టేదిలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేంద్ర పథకాలను అమలు చేయకపోతే తీసు కున్న నిధులను వెనక్కి ఇవ్వాల్సివస్తుందనే భయంతోనే కేసీఆర్‌ ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలను తెలంగాణలో మొదలుపెట్టారని ఆయన విమర్శించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. 

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న టీఆర్‌ఎస్‌పై ప్రజాప్రతినిధులు తిరగబడటం మొదలుపెట్టారన్నారు. భవి ష్యత్‌లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నేడు బీజేపీలోకి పలువురు నేతలు : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలానికి చెందిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు సహా 40 మంది నేడు ఎంపీ ధర్మపురి అరవింద్‌ నేతృత్వంలో హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో సంజయ్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. వీరు శనివారం ఢిల్లీలో బండి సంజయ్‌ని కలిశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు