ఏపీలో వినాయక మండపాలపై ఎలాంటి ఆంక్షలు లేవు: కోన రఘుపతి

30 Aug, 2022 13:54 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హిందూ ధర్మాన్ని కాపాడటానికి కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్‌, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో ధార్మిక పరిషత్‌ ఏర్పాటైందని తెలిపారు. గతంలో ధార్మిక పరిషత్ ఏర్పాటులో నిర్లక్ష్యం చేయడంతో పాటు తక్కువ చేసి మాట్లాడారన్నారు. వినాయక చవితి సందర్భంగా వారం రోజులుగా  ప్రతిపక్షాలు పనికట్టుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేని చంద్రబాబు, బీజేపీ ఈ రోజు చవితి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఎన్నిసార్లు ఆ ధర్మాన్ని ఎన్నిసార్లు అవహేళన చేసారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి కూడా ఈ రోజు విమర్శలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఆ 23 స్థానాలు కూడా దక్కించుకోవడం కష్టమనే ఆవేదనలో చంద్రబాబు ఉన్నాడు. బీజేపీ, జనసేన, టీడీపీలు తస్మాత్ జాగ్రత్త. బీజేపీలో టీడీపీ బీజేపీ, బీజేపీ అనే రెండు వర్గాలు ఉన్నాయి. పవన్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మానేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. అప్పటి వరకు పవన్‌ని ప్రజలు నమ్మరు.. గౌరవించరు. ఎన్నో దేవాలయాలను కూలగొట్టిన ఘనత వాళ్లదైతే మా నాయకుడు నిర్మాణాలు చేస్తున్నారు. వినాయక చవితిపై ఎటువంటి ఆంక్షలు లేవని ప్రజలు గమనించాలని'' కోరారు.

చదవండి: (Kuppam: కుప్పంలో టీడీపీ మరో డ్రామా)

'మొదటి నుంచీ ఉత్సవ కమిటీలు, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నాయి. నీతిమాలిన, దిగజారి పోయిన చంద్రబాబు ఆలోచనలు ఏ స్థాయికైనా వెళ్లొచ్చు.. జాగ్రత్తగా ఉండండి. ఎక్కడా అపశృతి జరగకూడదు అని పోలీస్ శాఖ వివరాలు కోరుతుంది. ఇది మొదటి నుంచి జరుగుతూనే ఉంది.. కొత్త విషయం కాదు. కనీస విద్యుత్ చార్జీని రూ.1000 నుంచి సీఎం రూ.500కి తగ్గించారు. అయినా సరే అవేమీ పట్టనట్లు రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నారు. ఒక సున్నితమైన అంశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలే రానున్న రోజుల్లో బుద్ది చెప్తారని' ఎమ్మెల్యే కోన రఘుపతి హెచ్చరించారు. 

చదవండి: (ప్రత్యామ్నాయాలపై కేంద్రం చెప్పడం లేదు)

మరిన్ని వార్తలు