బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి.. సీఎంకు ప్రవీణ్‌కుమార్‌ లేఖ

27 Dec, 2022 08:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీసీ రిజర్వే షన్లను 27% నుంచి 50 శాతానికి పెంచా లని, బీసీ జన గణన ను చేపట్టాలని ప్రభు త్వాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశా రు. తెలంగాణలో బీసీల జనాభా 50 శాతా నికిపై ఉన్నా విద్య, ఉద్యోగాలు సహా అన్ని రంగాల్లో బీసీల వాటా 27శాతమే ఉందన్నారు.

పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వే షన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 50% నిధులను బీసీలకు కేటా యించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బహిర్గతపరచాలని డిమాండ్‌ చేశారు. బీసీల సమస్యలను తక్షణ మే పరిష్కరించకపోతే ప్రభుత్వం రాజీనామా చేసి గద్దెదిగాలని లేఖలో డిమాండ్‌ చేశారు.
చదవండి: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు