రాజ్యాధికారమే బీసీల లక్ష్యం కావాలి

2 Oct, 2023 03:07 IST|Sakshi

గౌడగర్జన సభలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌  

పాపన్న పోరాట స్ఫూర్తితో చైతన్యమవ్వాలి 

బీసీలకు టికెట్లు ఇవ్వకుంటే బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి తాళం వేస్తాం 

గాంధీ భవన్‌ను రెడ్డిభవన్‌గా మార్చుకోండి 

కేయూ క్యాంపస్‌: ’’అర శాతం, ఐదు శాతం ఉన్నవాళ్లు బహుజనులపై పెత్తనం చెలాయిస్తున్నారనీ, బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా.. సర్దార్‌ సర్వాయి పాపన్న పోరా ట స్ఫూర్తితో బీసీలు, గౌడన్నలు చైతన్యవంతం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం గౌడ సంఘాల ఉ మ్మడి వరంగల్‌ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్‌ లో నిర్వహించిన గౌడ గర్జన సభలో ఆయన మాట్లాడారు.

ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు కూడా బహుజన కులాలకు జనాభా ప్రతిపాదికన సీట్లు కేటాయించడంలేదని, బీసీలను ఓటర్లుగానే వాడుకుంటున్నారని ఆరోపించారు. మన హక్కులను సాధించుకోవాలంటే ఎక్కువ శాతం వాటా ఉన్న బీసీలే అధికారంలోకి రావాలన్నారు. ఇందుకు రాబోయే రోజుల్లో ఓబీసీ పార్టీ కూడా అవసరమని అభిప్రాయపడ్డారు.  

ఏ పార్టీ కూడా బీసీని సీఎం చేస్తామనడం లేదు
ఏ పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తా మని చెప్పటం లేదని శ్రీనివాస్‌గౌడ్‌ గుర్తు చేశారు. ’’బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే 115 సీట్లు కేటాయించగా అందులో ఐదుశాతం ఉన్న రెడ్లకు 40 టికెట్లు ఇచ్చారు.. అర శా తం ఉన్న వెలమలకు 12 సీట్లు ఇచ్చారు.. ఈ లెక్కన బీసీలకు ఇచ్చింది తక్కువే. ఉ మ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక్క గౌడ్‌కు కూడా టికెట్‌ ఇవ్వదు.. ఇంకా బీఆర్‌ఎస్‌ బీఫామ్‌లు ఇవ్వలేదు కాబట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు, గౌడలకు సీట్లు కేటాయించాలి.. లేని పక్షంలో లక్షమందితో హైదరాబాద్‌కు వచ్చి ఆ పార్టీ కార్యాలయానికి తాళం వేస్తాం’అని శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.

కాంగ్రెస్‌ పార్టీ కూడా రెడ్లకే ఎక్కువ సీట్లు ఇచ్చి బీసీలను విస్మరిస్తే గాంధీ భవన్‌కు తరలివస్తామన్నారు. గాంధీ భవన్‌ను రెడ్డిభవన్‌గా మార్చుకోవాలని ఎద్దేవాచేశారు. బీజేపీ సైతం అదేబాటలో ఉండబోతోందని, ప్రధాని నరేంద్ర మోదీ తాను ఓబీసీ అని చెప్పుకుంటున్నారే తప్ప ఓబీసీలకు ఒరగబెట్టిందేమి లేదని ఆయన విమర్శించారు.

గౌడ సంఘాల జేఏసీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా చైర్మన్‌ బైరి రవికృష్ణగౌడ్‌ అధ్యక్షతన ఈ సభలో తెలంగాణ గౌడసంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరిగౌడ్, ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్, జిల్లా అ«ధ్యక్షుడు చిర్ర రాజు గౌడ్, బాధ్యులు కత్తి వెంకటస్వామి గౌడ్‌ పాల్గొన్నారు. తొలుత  ఏకశిల పార్కు నుంచి గౌడలు ర్యాలీగా ఆడిటోరియం గ్రౌండ్‌కు చేరుకున్నారు.  

మరిన్ని వార్తలు