బెల్లంపల్లి రాజ‌కీయ చ‌రిత్ర.. గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

18 Jul, 2023 19:07 IST|Sakshi

బెల్లంపల్లి రిజర్వుడ్‌ నియోజకవర్గంలో 2014లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ది దుర్గం చిన్నయ్య రెండోసారి గెలుపొందారు. ఇక్కడ మాజీ మంత్రి జి.వినోద్‌ బిఎస్పి పక్షాన పోటీచేసి ఓడిపోయారు. అంతకుముందు ఆయన టిఆర్‌ఎస్‌లో ఉన్నారు. టిఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఇవ్వలేదన్న కోపంతో బిఎస్పి టిక్కెట్‌ తీసుకుని ఇక్కడ పోటీచేసి  ఓటమి చెందారు. చిన్నయ్యకు 11276 ఓట్ల  మెజార్టీ వచ్చింది. చిన్నయ్యకు మొత్తం 55026 ఓట్లు రాగా, వినోద్‌కు 31359 ఓట్లు తెచ్చుకున్నారు. కాగా మూడోస్థానం ఇండిపెండెంట్‌ అబ్యర్ధిగా ఉన్న కె.వేద పదివేలకుపైగా ఓట్లు తెచ్చుకున్నారు. సిపిఐ సీనియర్‌ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ డిపాజిట్‌ దక్కించు కోలేకపోయారు. కాంగ్రెస్‌ ఐ మద్దతు ఇచ్చినా ఫలితం లేకపోయింది. 

భారీ ఆదిక్యతతో.. 
బెల్లంపల్లి రిజర్వుడ్‌ నియోజకవర్గంలో 2009లో గెలిచి ఆ శాసనసభలో సిపిఐ పక్ష నేతగా ఉన్న గుండా మల్లేష్‌ వరసగా  ఓటమి చెందారు. 2014లో బెల్లంపల్లిలో టిఆర్‌ఎస్‌ అభ్యర్ది దుర్గం చిన్నయ్య భారీగా 52,528 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో మల్లేష్‌ కూడా యాక్టివ్‌గా ఉన్నా ఫలితం దక్కేలేదు. 2014లో  బెల్లంపల్లిలో టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్రకు 9167 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రముఖ బొగ్గు కేంద్రంగా ఉన్న బెల్లంపల్లి 2009లో రిజర్వుడ్‌ నియోజకవర్గంగా ఏర్పడింది. మల్లేష్‌ గతంలో ఆసిఫాబాద్‌ నియోజకవర్గం (ఎస్‌.సి)లో మూడుసార్లు 1983, 1985, 1994లో  విజయం సాధించారు.2009లో నాలుగో సారి గెలిచిన తరువాత మల్లేష్‌ సిపిఐ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు.

బెల్లంపల్లి నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

మరిన్ని వార్తలు