West Bengal: ‘ఓటు వేసేందుకు ప్రజలు ప్రాణాలనే ఒడ్డారు’

11 May, 2021 08:23 IST|Sakshi

కోల్‌కతా: ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రంలో ప్రజలు తమ ప్రాణాలనే పణంగా పెట్టారని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ వ్యాఖ్యానించారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో త్వరలో స్వయంగా పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ‘రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస ఆందోళనకరం. హింస ప్రభావిత ప్రాంతాల్లో త్వరలో పర్యటిస్తా. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్న  విజ్ఞప్తిపై రాష్ట్ర యంత్రాంగం నుంచి సమాధానం రాలేదు’ అని వెల్లడించారు.

మీ మరణానికి, మీ ఆస్తుల విధ్వంసానికి, మీపై దాడులకు మీరు ఓటు వేయడమే కారణమైతే, అక్కడ ప్రజాస్వామ్యం నశించిందనడానికి అదే సంకేతం’ అని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసలో 16 మంది వరకు చనిపోయినట్లు సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు.
(చదవండి: బెంగాల్‌లో హింస: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం)

మరిన్ని వార్తలు