ఎమ్మెల్యేను చేస్తే.. పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేస్తారా?

29 Jul, 2020 19:54 IST|Sakshi

అడుగుగడుగునా.. అడ్డంకులే..

ప్రజాస్వామ్యంలో నయారాచరికం

కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసిన జంపింగ్ ఎమ్మెల్యే రేగా

సీఎల్పీ నేత భట్టి అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు

భట్టితో పాటు పాల్గొన్న ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ కేంద్రమంత్రి బలరామ్ నాయక్, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్

నేనేం చేయలేనన్న మునిసిపల్ కమిషనర్

సాక్షి, ఖమ్మం: ఒక ద్రోహి మరో ద్రోహితో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు నిప్పులు చెరిగారు. మణుగూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యే రేగా కాంతారావు రాత్రికి రాత్రే రంగులు మార్చేసి టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చడంపై భట్టి విక్రమార్క మల్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మణుగూరులో కాంగ్రెస్ నాయకుల చేపట్టిన నిరాహార దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మల్లుతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, పీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. ఎక్కడో టీచర్‌గా పని చేస్తున్న రేగా కాంతారావును.. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చి ఎమ్మెల్యేను చేస్తే.. పార్టీ ఫిరాయించి పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ద్రోహి రేగా కాంతారావు.. తెలంగాణ ఇస్తే.. పార్టీని విలీనం చేస్తానని చెప్పి మోసం చేసిన మరో ద్రోహి కేసీఆర్‌తో కలిసి స్వాంతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించిన వారికి చట్టపరంగానే బుద్ధి చెవుతామని మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. (‘మూడు విభాగాలుగా విభజించి వైద్యం’)

ప్రజాస్వామ్యం ఖూనీ
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నయా రాచరికంతో పాలన చేస్తోంది. ఇందుకు తాజా నిదర్శనం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జంపింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావు.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా కబ్జా చేశారు. దీనిని నిరసిస్తూ.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలొని కాంగ్రెస్ బృందం మణుగూరు బయల్దేరింది.

పోలీసు పహారాలో...
సీఎల్పీనేత భట్టి విక్రమార్క నేత్రుత్వంలోని కాంగ్రెస్ బ్రుందం ఖమ్మంలో ఉదయం 9 గంటలకు బయలు దేరినప్పటి నుంచీ ప్రతిక్షణం పోలీసులు నిఘా కళ్లతో వెంబడించారు. అడుగడుగునా.. చెకింగ్‌ల పేరుతో ఆపుతూ.. భట్టి బృందాన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా సీఎల్పీ నేత ముందుకే సాగారు. తల్లాడ, కొత్తగూడెం, పాల్వంచ,భద్రాచలం క్రాస్ రోడ్,  అశ్వాపురం తదితర ప్రాంతాల్లో పోలీసులు భట్టి బృందాన్ని చెకింగ్‌ల పేరుతోనూ, అనుమతులు పేరుతోనూ, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు. మణుగూరులో సాధారణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలకన్నా.. అధిక సంఖ్యలో పోలీసులను ప్రభుత్వం మొహరించింది. (కరోనా : ఆస్పత్రిలో బెడ్స్‌ ఖాళీ లేకపోవడంతో..)

నేనేం చేయలేను... వద్దంటే వెళ్లిపోతా: మునిసిపల్ కమిషనర్
పార్టీ కార్యాలయ్ వివాదంపై నేనేం చేయలేను.. నా మీద అధికార పార్టీ ఒత్తిడి తీవ్రంగా.. ఉందని మునిసిపల్ కమిషనర్.. వెంకటస్వామి మీడియా ముఖంగా ప్రకటించారు. రికార్డులు నా వద్ద లేవు.. గతంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో రికార్డులను ఉన్నతాధికారులు తీసుకెళ్లారు.. ఇప్పుడు నేనేం చేయలేను.. వద్దంటే ఇంకోచోటకు బదిలీ చేయించుకుని.. లేదంటే సెలవుపై వెళ్లిపోతాను.. అంతకుమించి నేనేం చేయలేనని మీడియా ముఖంగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు