పవన్‌ కల్యాణ్‌ స్టేట్‌ రౌడీ

28 Feb, 2021 04:50 IST|Sakshi

జనసైనికులు ఆకు రౌడీలు

భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌ ఫైర్‌ 

సాక్షి, భీమవరం: భీమవరం అర్బన్‌ బ్యాంకును దోచేశానని, తానొక ఆకు రౌడీనంటూ జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ తీవ్రంగా హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పవన్‌కల్యాణ్‌ స్టేట్‌రౌడీ మాదిరిగానూ, జనసైనికులు ఆకు రౌడీలుగానూ ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.

గతంలో ఓ సమావేశంలో పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ వాళ్ల తలలు తీస్తానని, మెడమీడ తలకాయలుండవని మాట్లాడిన వీడియోలను శ్రీనివాస్‌ మీడియా ఎదుట ప్రదర్శించారు. భీమవరం అర్బన్‌ బ్యాంకును దోచేశానని చెబుతున్న పవన్‌ తన మిత్రుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనపై ఎందుకు కేసులు పెట్టలేదని సూటిగా ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ మానసిక రోగి అని, అందువల్లనే చిన్నతనంలోనే అనేకసార్లు ఆత్మహత్యాయత్నాలు చేశాడని విమర్శించారు. మత్స్యపురి గ్రామంలో జరిగిన  ఘటనపై పూర్తిస్థాయిలో నివేదిక తెచ్చుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు