మునుగోడులో టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌.. ఇలా జరిగిందేంటి!

10 Aug, 2022 15:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ అంతా మునుగోడుపైనే ఉంది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా మునుగోడుపైనే ఫోకస్‌ పెట్టాయి. ఉప ఎన్నికల బరిలో ఎవరిని పోటీలో నిలపాలి అని కసరత్తులు చేస్తున్నాయి. 

ఇక​, అధికార టీఆర్‌ఎస్‌ ఎలాగైనా మునుగోడులో గులాబీ జెండా ఎగురవేయాలని పావులు కదుపుతుండగా ఊహించని అసమ్మతి సెగ తగిలింది. కాగా, మంత్రి జగదీష్‌రెడ్డి ఇంట్లో మునుగోడు నియోజకవర్గ నేతలు బుధవారం భేటీ అయ్యారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లను మంత్రి జగదీష్‌ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. 

ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ నేత కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొదని వారు అసమ్మతి గళం వినిపించారు. కూసుమంట్లకు టికెట్‌ ఇస్తే ఎన్నికల్లో సపోర్టు చేసేదిలేదంటు తేల్చి చెప్పారు. ఈ విషయంపై వారం క్రితమే సీఎం కేసీఆర్‌కు అసమ్మతి నేతలు లేఖలు రాసినట్టు తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి జగదీష్‌ రెడ్డి అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది.  

ఇది కూడా చదవండి: మునుగోడులో మరో ట్విస్ట్‌.. ఉప ఎన్నిక బరిలో వామపక్షాలు?

మరిన్ని వార్తలు