Bigg Boss Fame Kamya Panjabi Joins Congress: కాంగ్రెస్‌లో చేరిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌..

27 Oct, 2021 20:37 IST|Sakshi

ముంబై: బిగ్‌బాస్‌ ఫేమ్‌, ప్రముఖ నటి కామ్యపంజాబీ బుధవారం కాంగ్రెస్‌పార్టీ కండువ కప్పుకున్నారు. సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యతగా చేసిన బిగ్‌బాస్‌ 7వ సీజన్‌లో కామ్య పంజాబీ ప్రజాదరణ పొందారు. కాగా, తాజాగా ఆమె.. ముంబైలోని మహరాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలో చేరారు. ఆమె ముంబై కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ భాయ్‌జగ్‌తప్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కండువ కప్పుకున్నారు. ఆమె ఇటీవల తన సూపర్‌హిట్‌ షో, శక్తి-అస్థిత్వ కే ఎహసాస్‌కీ షూటింగ్‌ను పూర్తిచేసుకున్నారు.  

ఈ సందర్భంగా కామ్యపంజాబీ మాట్లాడుతూ.. తాను 20 ఏళ్లకు పైగా సినిపరిశ్రమలో పని చేశానని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో  రాజకీయాలలోకి వచ్చానన్నారు. మహిళల సాధికారికత కోసం పాటుపడతానని తెలిపారు. అదే విధంగా గృహహింస, మహిళలపై దాడులను నివారించడానికి తనవంతుగా కృషిచేస్తానని పేర్కొన్నారు

తాను​ అధికారం కోసం కాకుండా..  ప్రజలకు మంచి చేయాలనే పార్టీలో చేరానని తెలిపారు. తాను.. రాజకీయాలలో చేరినప్పటికి.. సినిమాల్లోకూడా నటిస్తానన్నారు. తాను ప్రజలకు..  చేయగలిగింది మాత్రమే చెప్తానని.. అదే విధంగా ఏదైతే చెప్తానో అది తప్పకుండా చేస్తానని బిగ్‌బాస్‌ నటి కామ్యపంజాబీ తెలిపారు. 

చదవండి: పంజాబ్‌లో మారనున్న రాజకీయ సమీకరణాలు

మరిన్ని వార్తలు